సర్పంచ్‌ చెప్పుతో కొట్టడంతో యువకుడి ఆత్మహత్య

జనగామ : సర్పంచ్‌ చెప్పుతో కొట్టాడన్న అవమాన భారంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. సర్పంచ్‌ ధరషావత్‌ రమేశ్‌ వీధి లైట్లు వేయిస్తుండగా, తన ఇంటి ముందున్న పోల్‌ కు కూడా వీధిలైట్‌ వేయాలని యువకుడు స‌ర్పంచ్ ధ‌ర‌షావ‌త్‌ను అడిగాడు. దానికే ఆగ్ర‌హం తెచ్చ‌కున్న స‌ర్పంచ్ ఆ యువ‌కుడితో గొడ‌వ‌కు దిగాడు. న‌న్ను అడగడానికి నువ్వెవరని సర్పంచ్‌ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన‌ సర్పంచ్‌ ఆ యువకుడిని చెప్పుతో కొట్టాడు. ఆ అవ‌మాన భారంతో యువ‌కుడు తీవ్ర‌మ‌న‌స్థాపానికి లోనై పురుగుల మందు తాగాడు. అనంత‌రం బంధువులు, చుట్టుప‌క్క‌ల‌వారు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు మరణించాడు. సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.