`సాగర్` ఉప ఎన్నికపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
నల్లగొండ:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “సాగర్ ఉప ఎన్నిక బరిలో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందాం అంటే తననే నిలబెడతామన్నారు. అలా కాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటాము అంటే వారికే తన మద్దతు ఉంటుంది“ అని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానా రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
కాగా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం గత ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ తరఫున బరిలో నిలబడి విజయం సాధించారు. నోముల అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ జానా రెడ్డిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది.