`సాగ‌ర్`‌లో ప్ర‌చారం.. వరి కోతలో పాల్గొని కూలీల‌ ఓట్ల అభ్యర్థన

నల్లగొండ: నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం కోనసాగుతోంది. మామూలుగా ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాయకులు ఓట్ల‌కోసం వినూత్న రీతిలో ప్ర‌చారం చేస్తుంటారు. తాజాగా టీఆర్‌ఎస్‌ నాయ‌కులు గురువారం త్రిపురారం మండలంలోని లచ్చతండాలో వరికోసే కూలీలను కలిసి వారి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాసేపు కూలీలకు విశ్రాంతినిచ్చిన నేతలు పొలంలో నడుం వంచి వరి కోత కోశారు. ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.