సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే : హరీష్ రావు

సిద్దిపేట: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం పూలే 195వ జయంతి వేడుకలను సిద్దిపేట పాత బస్టాండ్ కూడలిలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్త o రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె రాజనర్సు లతో కలిసి పూలే నిలువెత్తు విగ్ర‌హానికి పుష్పాంజలి ఘటిం చారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.