సింగరేణి అధికారులకు శుభ‌వార్త‌

రూ. 111 కోట్ల పీఆర్పీ చెల్లింపునకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం

మంచిర్యాల‌: సింగరేణి అధికారులకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు గుడ్‌న్యూస్ చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న 2500 మంది అధికారులకు పర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే (పీఆర్పీ) చెల్లించాలని నిర్ణయించారు. దీనివల్ల జూనియర్‌ అధికారులకు రూ.లక్ష వరకు పీఆర్పీ వస్తుంది. సీనియర్‌ అధికారులకు రూ.5 లక్షల వరకు రానున్నది. 2018-19కి సంబంధించి బకాయిగా ఉన్న రూ.111 కోట్లను చెల్లించేందుకు అంగీకరించారు. ఈ మొత్తాన్ని ఫిబ్రవరి నెలలో చెల్లించనున్నారు. పీఆర్పీ చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై సింగరేణి సీఎండీ శ్రీధర్‌ హర్షం వ్యక్తంచేశారు.

Leave A Reply

Your email address will not be published.