సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి: ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ పంపిణీచేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 5 లక్షల 63 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 472 మందికి 2 కోట్ల 98 లక్షల 70 వేల 300 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.