సిజెఐ ఎన్వీ రమణను కలిసిన తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు

హైదరాబాద్ (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను శనివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచినందుకు సిజెఐకి ధన్యవాదాలు తెలిపారు.
శామీర్పేటలో న్యాయవాదుల శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని సీజేఐ ని బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి చొరవ చూపాలని అభ్యర్థించారు.