వార‌ఫ‌లాలు (జూన్ 13-19)

మేష రాశి
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నూతనోత్సాహంతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

వృషభ రాశి
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం రాజకీయవర్గాలు మాటపడాల్సిన పరిస్థితి. వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం యత్నాలు చేస్తారు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వైద్యసేవలకు కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. ఆస్తుల ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు తప్పకపోవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

మిథున రాశి
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం చిత్రమైన కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. కొత్తగా చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. భూఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి శుభం కలుగుతుంది.

సింహ రాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

ఈ వారం వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంతమేర తగ్గవచ్చు. కళారంగం వారికి వివాదాలు సర్దుకుంటాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు, వైద్యసేవలు. కుటుంబసభ్యులతో విభేదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. భూములు,వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే కొంత మెరుగుపడతాయి. ఒక ఆసక్తికర సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగవేటలో విజయం సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

కన్యా రాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొంత సొమ్ము అందినా అవసరాలకు సరిపడదు. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలతో సతమతమవుతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు నిరాశ పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

తుల రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం. కళారంగం వారికి అవకాశాలు కొన్ని చేజారవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు. మీ ఆలోచనలు స్థిరంగా సాగక నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం కొన్ని పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం బంధువుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూముల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటినిర్మాణయత్నాలు కలసివస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

మకర రాశి
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని చికాకులు తప్పవు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

కుంభ రాశి
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. కళారంగం వారికి కొంత గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తుల వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

మీన రాశి
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు మరింత జఠిలం కావచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. శుభం కలుగుతుంది.

-ఎన్‌.రాజ్య‌ల‌క్షి
జ్యోతిష్య‌పండితులు

1 Comment
  1. Money Online says

    Wow, amazing weblog layout! How long have you ever been blogging for? you made blogging glance easy. The total glance of your website is magnificent, as smartly as the content material!!

Leave A Reply

Your email address will not be published.