సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనున్న నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగినట్లు తెలిసింది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.. టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బిజెపి కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి.. ఇరుపార్టీల శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతిపై బిజెపి కార్యకర్తలు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది.. కార్యకర్తలను చెదరగొట్టినట్టు సమాచారం.
పథకం ప్రకారమే బిజెపి ఇలా: ఎమ్మెల్యే క్రాంతి
రేపు జరిగే ఉప ఎన్నకలో ఓటమి తప్పదని.. డిపాజిట్ కూడా దక్కే పరస్థితి లేనందునే బిజెపి పథకం ప్రకారం అల్లరి సృష్టించేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్యే క్రాంతి అన్నారు. దీనిపై ఇసికి ఫిర్యదు చేస్తామని చెప్పారు.