సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అకక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. పెద్దపెల్లి జిల్లాకు చెందిన బయ్యారపు సరేందర్రెడ్డి (39) న్యాయవాది, ఆయన తన తండ్రి రాజిరెడ్డి (62), తల్లి విజయ (58)తో కలిసి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో సిద్దిపేట శివారు రంగిలా చౌరస్తా సమీపంలో రహదారి పక్కన ఉన్న కల్వర్టును కారు ఢీ కొట్టికొట్టడంతో కార్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట టూ టౌన్ సీఐ పరశురాం , ఎస్ఐ కనకయ్య మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని శవాలను మార్చురీ కి తరలించడానికి ప్రయత్నిస్తుండగా,అదే సమయంలో కరీంనగర్ నుండి వస్తున్న DCM ఘటనాస్థలిలో గుమిగూడిన జనంపైకి దూసుకొచ్చిన డీ కొట్టగా సిద్దిపేట సీఐ పరశురాం గౌడ్ తో పాటు కానిస్టేబుల్స్, మరియు 10 మంది స్థానికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి మల్లేశం (42), మందపల్లి కి చెందిన ఎల్లారెడ్డి (50)మృతి చెందారు. ఈ ప్రమాదం నుండి SI కనకయ్య గౌడ్ క్షేమంగా బయట పడ్డారు. ఘటన స్థలానికి CP జోయల్ డేవిస్ సిద్దిపేట్, ACP రామేశ్వర్ వచ్చి క్షేతగాత్రులని చికిత్స గురించి హాస్పిటల్స్ కు తరలించారు.