సిరులవేణి సింగరేణి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణకు మకుటాయమానం సింగరేణి కాలరీస్.. ఈ సంస్థ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. పుడమి పొరల్లోంచి బొగ్గును వెలికితీస్తూ దేశ పారిశ్రామిక రంగానికి సింగరేణి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని అన్నారు. సిరులవేణి సింగరేణి తెలంగాణకే తలమానికంగా నిలిచిందని ట్వీట్ చేశారు.
‘తెలంగాణ మకుటం.. నల్ల బంగారం.. సిరుల సింగారం.. మన సింగరేణి. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను పంచుతూ, తెలంగాణకే తలమానికంగా నిలిచిన సిరులవేణి సింగరేణికి 131వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కవిత ట్విటర్ ద్వారా సందేశాన్ని పంపారు.
తెలంగాణ మకుటం..నల్ల బంగారం..సిరుల సింగారం.. మన సింగరేణి. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను పంచుతూ, తెలంగాణకే తలమానికంగా నిలిచిన సిరులవేణి సింగరేణికి 131వ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు#Singareni pic.twitter.com/pZwX0sb6T6
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2020