సీఎంకు కృతజ్ఞతగా నిర్మ‌ల్ లో ర్యాలీ

ర్యాలీని ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ః నూతన రెవెన్యూచట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతగా, ఆ చట్టానికి సంఘీభావంగా శ‌నివారం నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ట్రాక్ట‌ర్ల‌ ర్యాలీ నిర్వహించారు. క‌న‌కాపూర్ వద్ద ఈ ర్యాలీని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్‌ ఫ్లెక్సీకి నాయకులు పాలు, పూలతో అభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపేందుకు కృతజ్ఞతగా అన్ని మండలాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున‌ తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటానని అందుకే కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని. ఈ చట్టం ద్వారా రైతు తాను ఎక్కడ ఉన్న తన యొక్క స్థిరాస్తులను రక్షించుకుంటూ ధైర్యంగా బతకవచ్చని మంత్రి రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డనే అని తాను కూడా తన వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండిస్తూ రైతు కష్టనష్టాలను తెలుసుకుంటూ ఉన్నాడని అందుకే రైతు మేలు కోసం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అదే కాకుండా రైతులను ప్రతినిత్యం కూడా డబ్బులతో వేధిస్తున్న విఆర్ఓ లను రద్దుచేసి పూర్తిగా ఆన్లైన్ ద్వారానే రైతుల భూములను పట్టాలు చేయించడమే కాకుండా వారికి ఉచితంగానే ధరణి పోర్ట్ లో రైతు వివరాలు పోందుపరచటం జరుగుతుంది అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.