సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇప్పడే కాదు!
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్

న్యూఢిల్లీ: సీబిఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు 2021 జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ జరుపలేమని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. ఆయన దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పాఠశాలల ఉపాధ్యాయులతో సంప్రదించిన తర్వాత మంగళవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలను నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదన్నారు. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత నిర్ణయిస్తామని తెలిపారు.