సుర్యాపేట జిల్లాలో ఇద్దరు తహసిల్దార్లు సస్పెన్ష‌న్‌

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 540 లో ప్రభుత్వ భూములను ఇతరులకు పట్టాలు చేశారని ఇద్దరు తహసిల్దార్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ప్రస్తుత మఠంపల్లి తాహసిల్దార్‌గా ఉన్న వేణుగోపాల్, గరిడేపల్లి తాహసిల్దార్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ లను సస్పెండ్ చేసిన కలెక్టర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మఠంపల్లి తాహసిల్దార్‌గా ఉన్న వేణుగోపాల్ 430 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా మ్యూటేషన్ ఇచ్చిన రెవిన్యూ యంత్రాంగం రికార్డుల‌ను మార్చ‌డు. అంతేకాకుండా మ‌రో 52 ఎకరాలు స్థానికులకు అక్రమంగా పట్టాలు ఇచ్చినట్లు విచార‌ణ‌లో తేల‌డంతో వేణుగోపాల్ పై క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు తీసుకున్నారు.
మ‌రో వైపు ఇదే జిల్లాక చెందిన గరిడేపల్లి తాహసిల్దార్ చంద్ర‌శేఖ‌ర్‌ 369 ఎకరాల భూమిని గ్లెడ్ ఆగ్రో బయోటెక్ సంస్థకు అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. 540 సర్వేనెంబర్ లో 6వేల ఎకరాల భూమికి గాను 12 వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చిన రెవెన్యూ యంత్రాంగం. కొనసాగుతున్న, విచారణ,సర్వే చేస్తున్న అధికార యంత్రాంగం. వ‌రుస‌గా రెవెన్యూ అధికారుల అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ప్ర‌జ‌లు తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.