సూర్యుడు ఇప్పుడే ఉద‌యించాడు.. క‌విత రాసిన మోదీ

హైద‌రాబాద్‌: ఆస్మాన్ మే స‌ర్ ఉటాక‌ర్‌.. ఘ‌నే బాద‌లోంకో చీర్ క‌ర్‌.. రోషినీ కా సంక‌ల్ప్ లే.. అబీ తో సూర‌జ్ ఉగా హై.. ఇదీ ప్ర‌ధాని మోదీ రాసిన క‌విత‌. 2021 కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆయ‌న ఈ క‌విత‌ను రాసిన‌ట్లు తెలుస్తోంది. మై గ‌వ‌ర్న‌మెంట్ ఇండియా ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ క‌విత‌తో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు. వినీల ఆకాశంలో త‌ల ఎత్తుకుని ఉండాల‌ని.. ద‌ట్ట‌మైన మేఘాల‌ను చీల్చుకుని.. వెలుగు లాంటి సంక‌ల్పంతో ముంద‌కు సాగాల‌ని.. ఇప్పుడే సూర్యుడు ఉద‌యించాడ‌న్న అంశాన్ని ప్ర‌ధాని మోదీ త‌న క‌విత‌లో తెలిపారు. మోదీయే స్వ‌యంగా ఆ క‌విత‌ను చ‌దివారు.

Leave A Reply

Your email address will not be published.