సోనూసూద్ కు కరోనా పాజిటివ్

ముంబయి: రియల్ హీరో, ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేస్తూ సోనూసూద్ ప్రకటించారు.
`ఈరోజు మార్నింగ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నానని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను“ అని సోషల్ మీడియాలో తెలిపారు సోనూసూద్.
‘మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… దీనివల్ల మీ సమస్యలను తీర్చడానికి నాకు మరికొంత సమయం దొరుకుతుంది. గుర్తు పెట్టుకోండి. మీకోసం నేను ఉన్నాను’ అంటూ తనకు కరోనా సోకిందన్న విషయాన్ని సోనూసూద్ వెల్లడించారు.