ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

చెన్నై: కోలీవుడ్ ప్ర‌ముఖ హాస్య‌స‌టుడు వివేక్ (59)‌ కన్నుమూశారు. శుక్ర‌వారం గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన విష‌యం తెలిసిందే. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు. వివేక్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర దిగ్భ్రాంతి నెల‌కొంది.

దర్శకుడు కె.బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. ‘మనదిల్ ఉరుది వేండం’ ద్వారా ఆయన సినీ ఆరంగేట్రం చేశారు. కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌, విజయ్, అజిత్‌తో కలిసి ఆయన నటించారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. `శివాజి`, `సింగం` సింగం-2`,`విశ్వాసం` చిత్రాల‌తో వివేక్ తెలుగు వారికి సుప‌రిచితుల‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.