స్టాక్ మార్కెట్లు: కొత్త రికార్డులు

ముంబయి: స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులతో ముగిశాయి. సోమవారం సెన్సెక్స్ 0.81 శాతం లాభపడి 47,353.75 పాయింట్ల దగ్గర ముగియగా.. నిఫ్టీ 0.9 శాతం లాభపడి 13,873.20 పాయింట్ల దగ్గర ముగిసింది. ఒక్క డిసెంబర్ నెలలోనే ఈ రెండు సూచీలు ఏకంగా 7 శాతం లాభపడటం విశేషం. కరోనా వల్ల గత మార్చి నెలలో దారుణంగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు ఆ తర్వాత ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకున్న చర్యలతో శరవేగంగా పుంజుకున్నాయి.