హర్యానా సీఎంకు కరోనా పాజిటివ్

చంఢీగఢ్: కరోనా వైరస్ పండితుడి నంచి పామరుడి వరకు.. సామాన్యుడి నుండి బ్రిటన్ ప్రధాని వరకు అందరినీ వణికిస్తోంది. తాజాగా ఇండియాలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. రెండు రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతవారం రోజుల్లో సీఎంను నేరుగా భేటీ అయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. వారంతా బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు కోరారు.