హిమాచల్:మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా!

ధర్మశాల: హిమాచల్‌ ప్రదేశ్‌లో ధర్మశాల సమీపంలోని సిద్బరి గైటో తాంత్రిక్‌ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భారీగా కేసులు న‌మోదు కావ‌డంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైందని కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ గుర్‌దర్శన్‌ గుప్తా పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని మఠంలోనే క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ మఠం పరిధిలోని ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామని వెల్ల‌డించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన సన్యాసుల్లో అత్యధికులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, వీరిలో ఒక సన్యాసి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండండంతో ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.