హుజూర్ నగర్ లో మోడీకి గుడి క‌ట్టిన అభిమాని

హుజూర్ నగర్ః  దేవుళ్ల‌కు ఆలయాలు, గోపురాలు కట్టడం మనమందరం చూస్తూనే ఉంటాం. కానీ దానికి భిన్నంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆలయం నిర్మించిన అభిమాని. వివరాలలోకి వెళితే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బైరు సతీష్ ప్రధానమంత్రినే సాక్షాత్తు దేవుడిగా భావించి తన ఆర్థిక స్తోమతలో చిన్న ఆలయాన్ని నిర్మించాడు. సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం కావడంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు బొబ్బ భాగ్యరెడ్డి చేతుల మీదుగా ఆలయాన్ని ఆవిష్కరింప చేశాడు. ఈ సందర్భంగా బొబ్బ భాగ్యరెడ్డి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపారని, భారతదేశం గర్వించదగ్గ ప్రధాని లభించటం మన అదృష్టమని, ఆయన తీసుకునే నిర్ణయాలకు ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారని అన్నారు. వయసులో చిన్నవాడైనా పెద్ద మనసుతో ప్రధాని ఆలయం నిర్మించేందుకు బైరు సతీష్ ని హుజూర్ నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తూ మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా పైరు సతీష్ మాట్లాడుతూ నిస్వార్థంతో, నిగర్విగా ప్రజా ఆమోదయోగ్యమైన పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఆలోచన, ఆశయాలకు ముగ్ధుడై భావితరాల వారికి మోడీ ఆదర్శం కావాలనే సంకల్పంతో తాను ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మూసుకుల చంద్రారెడ్డి, రామరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.