హుస్సేన్ సాగర్ పరిధిలో నైట్ బజార్లు!

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ పరిధిలో త్వరలో నైట్ బజార్లు రానున్నాయి. హైదరాబాద్‌లో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిధిలో నైట్ బజార్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీపీఈ పద్ధతిలో నైట్ బజార్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. అదే పద్ధతిలో ఈ బజార్లను అభివృద్ధి చేస్తామన్నారు. బోర్డు వాక్, పార్కింగ్, సిట్టింగ్ తదితర సౌకర్యాలతో నైట్ బజార్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.