హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

లులూ సంస్థల ఛైర్మన్‌కు తప్పిన ముప్పు

కొచ్చి : ప్రముఖ ప్రవాస వ్యాపారవేత్త ఎంఎ యూసుఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ఆదివారం ఉద‌యం కేరళలో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలెట్ దీనిని కొచ్చి సమీపంలోనే అత్యవసరంగా నేలకు దింపారు. పన్నన్‌గడ్ ప్రాంతంలో హెలికాప్టర్ అత్యవసర ల్యాండ్ అయిన ప్రాంతం అంతా చిత్తడి నేల ఉండటంతో పెను ముప్పు తప్పిందని వెల్లడైంది. ఇంటర్నేషనల్ రిటైల్ గ్రూప్ లులూ గ్రూప్ ఛైర్మన్ అయిన యూసుఫ్ అలీ, ఆయన భార్య, ఇద్దరు సహ ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు కంపెనీ సొంత హెలికాప్టర్‌లో వెళ్లుతున్నారు. బాధితులను వెంటనే స్థానిక లేక్‌షోర్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా క్షేమంగా ఉన్నారని, అబ్జర్వేషన్‌లో ఉంచామని ఆసుపత్రి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కేరళలో ఉన్న యూసుఫ్ అలీ ఆసుపత్రిలో ఉన్న ఓ బంధువును పరామర్శించేందుకు కొచ్చిలోని తమ నివాసం నుంచి వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.