హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్(CLiC2NEWS): హైదరాబాద్లో ఉన్నట్టుండి సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు చోట్ల ఉరుములు, ఊదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ, అబిడ్స్, కోఠి, ట్యాంక్‌బండ్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. . ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, వర్షం కురియడంతో నగర ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది.