హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో పలు చోట్ల బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 165 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. 14వేల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వాటిని ప్రారంభించింది. ముందుగా రామంతపూర్, రామిరెడ్డి నగర్‌లో మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానా ప్రారంభించారు.
బస్తీ దవాఖానలుగా కమ్యూనిటీ హాళ్లు: మంత్రి తలసాని
జీహెచ్‌ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లలో బస్తీ దవాఖానాలను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గం, బోలక్‌పూర్ డివిజన్ గాంధీనగర్‌లో, అడిక్‌మెట్ పోచమ్మ బస్తీలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను తెలంగాణ రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అడిక్‌మెట్ కార్పొరేటర్ హేమలత రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 195 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మొత్తం 300 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి తెలిపారు.