హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు చర్యలు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: భాగ్యనరగంలోని తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్ ఫ్రాంక్ కార్యాలయాన్ని ప్రారంభించిన స్పెషల్ రిపోర్టును కూడా మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ సర్వేలో నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రసిద్ధిగాంచింది అని కేటీఆర్ తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలుపాటిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హెల్త్ కేర్, వైద్య, విద్యా రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీని కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. నైట్ ఫ్రాంక్ సీఎండీ శశిర్ బైజల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నూతన పాలసీలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ఏరోస్పేస్‌తో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఊపకుందుకుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా లీడర్‌షిప్ సిబ్బంది పాల్గొన్నారు.