హైదరాబాద్‌లో బోల్తాపడిన కారు..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. సోమవారం ఉదయం ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కారు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.