హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కోఠి హనుమాన్ టేక్డిలోని నకోడా కాంప్లెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్‌లోని అన్ని షాపులకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా ఈ నోయిడా కాంప్లెక్స్‌లో బట్టలు, ఆప్టికల్స్, ప్లాస్టిక్ షాపులు ఉన్నాయి. ఈ ప్రమాదంతో ఆస్తి నష్టం భారీగా సంభవించింది. కాగ ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.