హైదరాబాద్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్
హైదరాబాద్: డ్యూటీలో ఉండి మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ పీఏస్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్, శివప్రసాద్ ఈ నెల (ఫిబ్రవరి) 12న హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మద్యం సేవించారు. కానిస్టేబుళ్లు మద్యం తీసుకునే దృశ్యాన్ని షాడో పోలీస్ టీమ్ సెల్ఫోన్లో వీడియో తీశారు. కాగా అతడిపై దాడి చేసి మరీ కానిస్టేబుళ్లు ఆ సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఈ క్రమంలో జవాన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో 24 గంటల తరువాత ఎస్బీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.