హైదరాబాద్ బయలు దేరిన సిఎం కెసిఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి అదే రోజు సాయంత్రం కేంద్ర జలశక్తి, హోంశాఖ మంత్రులను కలిశారు. శనివారం ప్రధాని మోడీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, మిగతా కేంద్రమంత్రులతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఆరు దేశీయ విమానాశ్రయాల ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు.