హైవే పై మొక్కలు పరిశీలించిన ఓ.ఎస్.డి.ప్రియాంక వర్గీస్
నల్లగొండః నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల,నార్కట్ పల్లి, కట్టంగూర్ నకిరేకల్, కేతే పల్లి మండలాలలో ఎన్.హెచ్ . 65 కిరువైపులా హరిత హరం లో నాటిన మొక్కలను ముఖ్యమంత్రి కార్యాలయ ఓ.ఎస్.డి.(హరిత హరం) ప్రియాంక వర్గీస్ పరిశీలించారు.శుక్రవారం జిల్లాలో చిట్యాల మండలం గుండ్రం పల్లి,చిట్యాల మున్సిపాలిటీ,నార్కట్ పల్లి, కట్టం గూర్,నకిరేకల్, కేతే పల్లి మండలాల 21 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్.హెచ్.65 వెంబడి ఇరువైపులా నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్,ఎన్.హెచ్. అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.ఐదు మండలాల లోని 21 జి.పి. ల పరిధి లో ఎన్.హెచ్.65 వెంబడి హైవేకు ఇరువైపులా 66 కి.మీ లు హరిత హరం లో ఈ సంవత్సరం పంచాయతీ శాఖ ద్వారా హైవే వెంబడి 17,000 నాటిన మొక్కలు పరిశీలించారు.గత సంవత్సరం అటవీ శాఖ 28,000 మొక్కలు నాటడం జరిగిందని అధికారులు వివరించారు.జిల్లా యంత్రాంగం హరిత హరం లో బాగా పనిచేశారని,మొక్కలను పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.గుండ్రం పల్లి,వెలిమి నేడు వద్ద హై వే వెంబడి ఉన్న ఇండ్ల ముందు కూడా వరుసగా వుండేలా మొక్కలు నాటాలని సూచించారు.నాటిన మొక్కలు నరికి వేయాలంటే నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనుమతి కాకుండా డి.ఎఫ్. ఓ.నుండి ఎన్. ఓ.సి.తప్పని సరిగా తీసుకోవాలని అన్నారు. చిట్యాల మండలం గుండ్రం పల్లి నుండి చిట్యాల మున్సిపాలిటీ,నార్కట్ పల్లి, కట్టంగూర్,నకిరేకల్, కేతే పల్లి వరకు ఆమె పర్యటించి క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.