హోం క్వారంటైన్‌లో పవన్

హైదరాబాద్: జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు హోం క్యారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
`జనసేన అధినత పవన్ కల్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భ్రదతా సిబ్బంది. వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా ఒక్కొక్కరు కరోనా బారిన పడుతూ వస్తున్నారని వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వర్తిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు` అని ప్రకటనలో పేర్కొన్నారు.