1 టూ 8 ప‌రీక్ష‌లు ర‌ద్దు.. పై తరగతులకు ప్ర‌మోట్‌!‌

ముంబ‌యి: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్రలో క‌రోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ ప్ర‌భావం దేశంలో ఎక్కువ‌గా మ‌హారాష్ట్రపైనే ప్ర‌భావం చూపిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. క‌రోనా క‌ట్టడి కోసం రాష్ట్ర స‌ర్కార్ ప‌లు క‌ఠిన న‌ర్ణ‌యాలు తీసుకుంది. ఈ క్ర‌మంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థుల‌ను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. ఇక, 9, 11 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలా? ప్రమోట్ చేయాలా? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో ఇలా క్లారిటీ ఇచ్చారు. అయితే, రాబోయే బోర్డు పరీక్షలపై ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇక, మహారాష్ట్రలో ఎస్ఎస్‌సీ, హెచ్ఎస్సీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌ పంజా విసురుతోన్న సమయంలో పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పరీక్షలను సురక్షితంగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ గతంలో చెప్పింది. ప్రస్తుత తరుణంలో పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.