10 అడుగుల లోతులో పాతిపెడుతాం..
లవ్ జిహాద్ బిల్లుకు ఆమోందం తెలిపిన ఎంపి కేబినెట్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గట్టి వార్ణింగ్ ఇచ్చారు. వెంటనే వారు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లకపోతే 10 అడుగుల లోతులో పాతిపెడతానని హుకుం జారీ చేశారు.
గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా మాఫియా గ్యాంగ్‌లు, గుండాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన మూడ్ అసలే బాగోలేదని, రాష్ట్రంలో మాఫియాగాళ్లు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు ఆపకుంటే పది అడుగుల గోతిలో పాతిపెడతానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ‘మామా ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లకపోతే.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా 10 అడుగుల గోతిలో పాతి పెడతా’అని ట్విటర్ వేదికగా సీఎం చౌహన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు సమస్యలు లేకుండా ఉన్నప్పుడే అది గుడ్ గవర్నెన్స్ అవుతుందని, అలాంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మారుస్తామని ఆయన పేర్కొన్నారు.
బిల్లు ప్రకారం..
బలవంతపు మత మార్పిడులకు పాల్పడిన వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష.. రూ. 25 వలు కనీస జరిమానాను విధించనున్నారు. మైనర్, మహిళ లేక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తుల విషయంలో బలవంత మత మార్పిడులకు పాల్పడితే రెండు నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడనుందని మధ్యప్రదేశ్ హోమంత్రి సరోత్తమ మిశ్రా బిల్లులోని అంశాలను వెల్లడించారు. అలాగే రూ. 50 వేల కనీస జరిమానా వేయనున్నట్లు తెలిపారు.