10 ఏళ్లుగా ఫ్రిజర్‌లో త‌ల్లి శ‌వం!

టోక్యో: ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే కుటుంబ‌స‌భ్యులు, బంధువులు వ‌చ్చే వ‌ర‌కు శ‌వాన్ని చెడిపోకుండా ఫ్రిజ‌ర్‌లో ఉంచుతారు. కానీ ఓ మ‌హిళ ఏకంగా ప‌ది సంవ‌త్స‌రాల నుంచి త‌ల్లి శ‌వాన్ని ఫ్రిజ‌ర్‌లో ఉంచింది. ఈ ఘ‌ట‌న జ‌పాన్ రాజ‌ధాని టోక్యో న‌గ‌రంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌పాన్‌లోని టోక్యో న‌గ‌రంలో ఓ అపార్ట్‌మెంట్‌లో యుమి యోషినో (48) అనే మహిళ త‌న‌ తల్లితో ఉంటున్న‌ది. అయితే త‌న త‌ల్లి ప‌దేండ్ల క్రిత‌మే చ‌నిపోయినా విష‌యం ఎవ‌రికీ చెప్ప‌కుండా త‌ల్లి శ‌వాన్ని ఫ్రీజ‌ర్‌లో దాచిపెట్టింది.
అయితే ఇంటిస‌రిగ్గా క‌ట్టలేక పోవ‌డంతో ఇంటి య‌జ‌మాని ఇంటిని ఖాళీ చేయ‌మ‌ని ఆదేశించాడు. దాంతో ఇల్లు ఖాళీ చేస్తే త‌ల్లి విష‌యం బ‌య‌ట‌కు పొక్కుతుంద‌ని.. ఆమె ఇల్లు ఖాళీ చేయ‌డానికి నిరాకరించింది. దీంతో చేసేదేమి లేక ఇంటి య‌జ‌మాని పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. పోలీసుల రంగం ప్ర‌వేశం చేయ‌డంతో అస‌లువ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసిన పోలీసులు.. ఇంటి య‌జ‌మాని.. చుట్టు ప‌క్క‌ల వాళ్లు ఆశ్చ‌ర్య‌పోయారు.
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులను శుక్ర‌వారం యోషినోను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో తాను గత పదేండ్లుగా తల్లి శవాన్ని ఫ్రీజర్‌లో దాచి ఉంచాన‌ని చెప్పింది. అయితే ఫోరెన్సిక్ అధికారులు మృతురాలి శ‌వం నుంచి శాంపిల్స్ సేకరించి ఆమె ఎప్పుడు చ‌నిపోయిందో నిర్ధారించే ప‌నిలో ఉన్నారు. ఇప్పుడు ఆ నివేదిక వ‌స్తే అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డుతుంది. ఏది ఏమైనా త‌ల్లి శ‌వాన్ని ఇన్నేళ్లుగా ఫ్రిజ‌ర్‌లో దాచ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయం అయింది.

Leave A Reply

Your email address will not be published.