అగ్రవర్ణ పేదలకు 10శాతం కోటా.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ (CLiC2NEWS): అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10% రిజర్వేషన్ కల్పించడం.. రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విషయంపై సోమవారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అయిదుగురు ఉన్న ధర్మాసనంలో సిజెఐ లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఎస్ రవీంత్ర భట్, బేలా ఎం త్రివేది, జేబి పర్డివాలా ఉన్నారు. ధర్మాసనంలోని జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ వ్యతిరేకించగా.. మిగతా ముగ్గురు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 103వ న్యాయమూర్తులు సమర్థించారు. ఈ రిజర్వేషన్‌పై 3.2తో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈడబ్లూఎస్‌లకు రాజ్యాంగ సవరణ.. రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్ దినేశ్ మహేశ్వరీ తీర్పు వెలువరించారు. కేంద్ర ప్రభుత్వం 2019లో సార్వత్రిక ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ తీసుకొచ్చింది.