100 రోజులు మాస్క్ పెట్టుకోండి : బైడెన్‌

వాషింగ్ట‌న్: ఎంతో ఉత్కంఠ మధ్య‌ అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా జో బైడెన్ ఎన్నికైన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న దేశాధ్య‌క్షుడిగా జ‌న‌వ‌రి 20వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. దేశ ప్ర‌జ‌ల‌ను మాస్క్ ధ‌రించాల‌ని కోర‌నున్న‌ట్లు చెప్పారు. త‌న పాల‌న‌లో తొలి వంద రోజుల వ‌ర‌కు ప్ర‌జ‌లు మాస్క్ ధ‌రించేలా చేస్తాన‌న్నారు. ప్ర‌తి ఒక్క అమెరికా పౌరుడు మాస్క్‌ను ధ‌రిస్తే, క‌చ్చితంగా కోవిడ్ కేసులు త‌గ్గుతాయ‌ని ఆయ‌న ఓ మీడియాతో పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ప‌నిచేసే వారంద‌రు కూడా మాస్క్ ధ‌రించేలా చ‌ర్చ‌లు తీసుకుంటామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.