ఎంత‌కాలం జీవించామ‌న్న‌ది కాదు.. ఎలా జీవించామ‌న్న‌దే ముఖ్యం: మ‌ంత్రి కెటిఆర్‌

హైద‌రాబాద్: న‌గ‌రంలోని బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ప్ర‌ముఖ ర‌చ‌యిత సుర‌వరం ప్ర‌తాప‌రెడ్డి 125వ జ‌యంతి ఉత్స‌వాలు జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విశిష్ట అతిథులుగా మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సుర‌వరం చిత్రానికి మంత్రులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.
అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సుర‌వ‌రం కుటుంబ స‌భ్యుల‌కు హృద‌య‌పూర్వ‌క‌మైన ధ‌న్య‌వాదాలు తెలిపారు. సుర‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి అంటే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ ప‌త్రిక‌. దీని గురించి అంద‌రూ ప్ర‌స్తావ‌న తెస్తారు. ఈ గోల్కొండ కాకుండా ఆయ‌న‌లోని మిగ‌తా కోణాలు, పార్శ్వాలు తెలుసుకున్నాను. సుర‌వ‌రం సంక‌ల‌నాల ద్వారా చాలా విష‌యాలు తెలుసుకున్నాను. సుర‌వ‌రం అభ్యుద‌య భావాలు క‌లిగిన వ్య‌క్తి.. ఆయ‌న జీవితం సంఘ‌ర్ష‌ణ‌మ‌యం. 125 సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా ఆయ‌న గురించి గుర్తు చేసుకుంటూ ఉంటే.. ఎంత కాలం జీవించామ‌న్న‌ది కాదు.. ఎలా జీవించామ‌న్న‌ది ముఖ్యం అని కేటీఆర్ చెప్పారు. 125 ఏళ్ల త‌ర్వాత కూడా ఆయ‌న గురించి మాట్లాడుకుంటున్నామంటే.. స‌మాజంపై త‌న‌దైన ముద్ర వేయ‌డ‌మే అని కేటీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.