తిరుపతి ఎమ్మెల్యే భూమనకు కరోనా

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకి ఉదృతమవుతున్నాయి. తాజాగా అధికారపార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స కోసం ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆయన ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఏది ఏమైనా ఏపిలో కరోనా కేసుల పెరుగుదల మాత్రం తగ్గటం లేదు.