పిడుగుపాటుతో 12 మందికి గాయాలు..

జనగామ (CLiC2NEWS): జిల్లాలో శుక్రవారం సాయంత్రం పిడుగుబాటు కారణంగా 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని బచ్చన్న పేట మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆలింపూర్ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న బాధితులను బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.