13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సిఎం

నల్లగొండ: నెల్లికల్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్నగర్, సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర నాయక్, తదితర నాయకులు ఉన్నారు.