Vijayawada: అక్రమంగా తరలిస్తున్న 13 కిలోల బంగారం స్వాధీనం
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/13-kgs-gold-seized.jpg)
విజయవాడ (CLiC2NEWS) సుమారు రూ.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందుకున్న సమాచారంతో అధికారులు ప్రత్యేక బృందాలతో కాజా, బొల్లాపల్లి టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చెన్నై నుండి ప్రైవేటు బస్సుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 8 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారం .. విదేశీ బంగారమని, దానిపై ఉన్న గుర్తులను తొలగించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.