శ్రీ ప్లవనామ సంవత్సర రాశీఫ‌లాలు

రానున్న తెలుగుసంవ‌త్స‌రం పేరు `ప్ల‌వ‌`.. అంటే `నౌక‌`. వెల్ల‌బోతున్న సంవ‌త్స‌రం పేరు `శార్వ‌రి` అంతా చీక‌టిమ‌యం. ఎంతో క‌ష్ట‌కాలం..
ఆ కష్టాల నుంచి గ‌ట్టెక్కించే నావ `ప్ల‌వ‌`లోకి మ‌నం ప్ర‌వేశించ‌బోతున్నాం.. అంతా శుభంగా, సౌఖ్యంగా, ఆనంద‌మ‌యంగా ఉంటుంద‌న్న విశ్వాసం, నమ్మ‌కంతో ప‌ల్ల‌వ‌నామ ఉగాదికి స్వాగం చెబుదాం..

శ్రీ ప్లవనామ సంవత్సర ప్రధాన గ్రహసంచారం.
–––––––––––––––––––––––––––––
ఈ సంవత్సరమంతా శని మకరం, రాహువు వృషభం, కేతువు వృశ్చిక రాశుల్లోనే సంచరిస్తారు. ఇక గురువు సెప్టెంబర్‌14 వరకు కుంభరాశిలోనూ, అనంతరం నవంబర్‌20వరకు తిరిగి మకరరాశిలో సంచరించి తదుపరి సంవత్సరాంతం వరకూ కుంభరాశిలో సంచరిస్తాడు.


మేషరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు

మేషరాశి:- అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు, భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు .

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ, వ్యయాలు..
ఆదాయం – 08, వ్యయం – 14,
రాజపూజ్యం – 04 అవమానం – 03.

గురువు:- ఉగాది ప్రారంభం నుండి లాభస్థానమైన (కుంభం)లో నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా.. నవంబర్ తర్వాత లోహమూర్తిగా ఉంటాడు.

*శని:- సంవత్సరం అంతా… దశమ స్థానం (మకరరాశి)లో తామ్రమూర్తిగా ఉంటాడు.

*రాహు కేతువులు:- సంవత్సరం అంతా 2, 8(వృషభ, వృశ్చిక) రాశులలో లోహమూర్తులుగా ఉంటారు. వ్యతిరేక ఫలితాలు ఇస్తారు .
వారసత్వ సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు.
కుటుంబంలో శుభకార్య సంబంధమైన ఖర్చులు అధికంగా ఏర్పరచును.
ముఖ్యంగా పితృవర్గంలోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పడే పరిస్థితి గోచరిస్తున్నది.

వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రంలో ఉన్నవారు గురు గ్రహ శాంతి, జపము జరిపించుకొనుట మంచిది.

* 20 – నవంబర్ -2021 నుండి గురువు అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.

న్యాయమైన ధన సంపాదన కలిగించును.

జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.

* శని సంవత్సరం అంతా అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.

ఆశించిన విధంగా ధన సంపాదన కలుగజేస్తాడు.

నల్లని వస్తువులు, నల్లని ధాన్యములు, లోహములకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి మంచి లాభములు కలుగజేయును.

నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును.

సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగచేయును.

రాహువు సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తాడు.

* కేతువు అశుభత్వం వలన అనేక సమస్యలు ఏర్పడును.

శారీరక సౌఖ్యం తక్కువ అగును.

ప్రతి పనికి ఎక్కువగా శ్రమింప జేస్తాడు.

ఎవరి వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు ఉన్నవారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచనలు ఉన్నాయి.

ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించదు.

దైవోపాసన చేయలనుకునే వారికి అనేక విఘ్నములు ఏర్పడుతాయి.

కొన్నివిషయాలలో మీ ప్రమేయమేమి లేకుండానే అపవాదులు మరియు అవమానములను పొందడాన్ని సూచించుచున్నది.

వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది.

ప్రేమ వ్యవహారం పట్ల నమ్మకం పోతుంది.

అవివాహితులకు వివాహయోగం కల్గుతుంది.

సంతానప్రాప్తి. (దంపతులిరువురి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయి )

ఆత్మీయులతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.

స్వార్ధ పరులు, ఆవకాశవాదులు మీ దరిచేరుతారు జాగ్రత్తలు వహించవలెను.

స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.

వాహన యోగం,

గృహ యోగం.

రాజకీయ రంగాలవారికి పదవియోగం.

స్త్రీలతో విరోధం.

అంతర్గత రాజకీయాలు పెరుగుతాయి.

ఈ సంవత్సరం తలపెట్టిన కార్యాలు మూడు వంతులు పూర్తిచేస్తారు.

వ్యవసాయ దారులకు రెండు పంటలు లాభిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతులు కల్గుతాయి.

నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంది.

విద్యార్ధులకు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైయ్యే అవకాశాలున్నాయి .

సినిమా, టీవి, రంగాల వారికి కలిసి వస్తుంది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, గణపతికి గరిక పూజ చేయండి.


వృషభరాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

వృషభ రాశి:- కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభరాశికి చెందుతారు.

వృషభరాశి వారికి ఈ సంవత్సరం

ఆదాయం – 02 – వ్యయం – 08,

రాజపూజ్యం – 07 – అవమానం – 03.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు దశమస్థానమైన (కుంభం)లో రజితమూర్తిగా ఉంటాడు.

తర్వాత నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా .. ఆ తర్వాత సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరం అంతా … తొమ్మిదో స్థానమైన (మకరరాశి)లో రజితమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 1, 7 స్థానాలైన (వృషభ, వృశ్చిక) రాశులలో తామ్రమూర్తులుగా ఉంటారు.

* గురువు ఉగాది నుండి 19 నవంబర్ 2021 వరకు అశుభ స్థానం వలన – తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.

ముఖ్యంగా శారీరక సమస్యలుతో తరచుగా బాధించును.

జీవితంలో అనుభవిస్తున్నయోగం చెడిపోతుంది.

స్వయం కృతాపరాధం వలన కొన్నితప్పులు చేసి నష్టాలను కొని తెచ్చుకుంటారు .

ఏ ప్రయత్నం చేసినా కూడా మానసికంగా సంతృప్తి అనేది కనబడదు.

19 నవంబర్ 2021 వరకు కొత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది.

20 నవంబర్ 2021 నుండి వృషభరాశి వారికి గురువు యోగించి శుభఫలితాలు ఇస్తాడు.

వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశములు కలుగుతాయి,

స్వయం ఉపాధి చేసుకునే వారికి విశేష లాభాలు కలుగుతాయి.

విద్యార్థులకు అనుకూలమైన సమయం.

తీర్ధ యాత్ర ప్రయాణములు 20 నవంబర్ 2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు.

సాంప్రదాయ బద్దమైన జీవితం ప్రారంభించడానికి అత్యంత అనుకూల కాలం.

విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు.

* శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తాడు .

నూతన వాహన కోరిక నెరవేరును.

వారసత్వ సంపద లభించును.

పనిచేస్తున్న రంగములలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.

వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉంటే .. ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభింస్తుంది.

అనుకున్నఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు.

వ్యక్తిగత ఎవరి జాతకంలో శని స్వక్షేత్రంలో ఉన్నను

లేదా ఉచ్చ స్థితి ఉన్ననూ

లేదా మూల త్రికోణములో ఉన్నవారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు.

వీరు తమ వంశానికి, జాతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే .. సత్కార్యములు చేస్తారు.

* రాహువు – కేతువుల వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు.

ఉద్యోగులకు కోరుకున్న విధంగా స్థాన చలనం కలుగుతుంది.

పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవును.

కొంత శారీరకంగా అనారోగ్యం సమస్యలను మాత్రం ఎదుర్కొంటారు ,

వైవాహిక జీవతంలో తీవ్ర గొడవలు ఏర్పడే సూచలు ఉన్నాయి,

వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఏర్పరచును.

* (ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి.)

గోచార గ్రహస్థితి వలన అనేక బరువు భాద్యతలు మోయవలసి వస్తుంది.

తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచిస్తున్నాయి .

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.

సర్పదోషాలు, గ్రహాల దోషాలు ఉన్నవారు తగు నివారణ చేసుకోండి.

వివాహయోగం ఉంది.

వృత్తి, వ్యాపారాలలో ఆర్ధిక పురోగాభివృద్ది బాగుంటుంది.

విదేశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది.

ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.

ఇంటి విషయాలు పట్టించుకోకుండా, వ్యసనాలకు బానిసై ఇంట్లో అశాంతి సృష్టిస్తున్న జీవిత భాగస్వామి మీద విసుగు పుడుతుంది,

ఇది అందరికీ వర్తించదు .. వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఫలితం ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు ఉంటాయి. రోజు యోగాసనాలు, ధ్యానం చేయుట వలన కుదుటపడుతాయి .

ముఖ్యమైన విషయాలలో పెద్దల మాట వినడం శ్రేయష్కరం అని గ్రహించండి .

తల్లిగారి వైపు వంశ సూతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.

వ్యవసాయ దారులకు సామాన్య లాభం కలుగుతుంది, కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఉపాద్యాయులకు సన్మానం , తోటి ఉద్యోగులతో మంచి మిత్రుత్వం ఏర్పడుతుంది.

రాజకీయ నాయకులకు అనుకూలం .. సెప్టెంబర్ లోగా ఏదైనా పదవి లభించే అవకాశం ఉంది.

విద్యార్ధులు చదువుపై ఎక్కువ కృషి చేయాలి.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, గోమాతకు గ్రాసం పెట్టి .. పూజ చేయండి.


మిధునరాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములలో జన్మించినవారు మిధునరాశికి చెందుతారు.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి

ఆదాయం – 05 , వ్యయం – 05

రాజ పూజ్యం – 03, అవమానం – 06

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు భాగ్యస్థానమైన (కుంభం)లో లోహమూర్తిగా ఉంటాడు.. ఆ తర్వాత నవంబర్ 20 వరకు అష్టమంలో సువర్ణ మూర్తిగా ఉండి.. తదనంతరం సంవత్సరం అంతా తొమ్మిదో ఇంట్లో లోహమూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరం అంతా … అష్టమ స్థానమైన (మకరరాశి)లో లోహమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 6 , 12 (వృషభ, వృశ్చిక) రాశులలో సువర్ణ మూర్తులుగా ఉంటారు.

గురువు :- అశుభత్వం వలన ఉగాది నుండి 19 – నవంబర్ -2021 వరకు అనేక ఆటంకాలు కలుగజేస్తాడు ,

ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు గోచరిస్తున్నాయి,

సంతాన సంబంధ అనారోగ్యతలు ,

తోబుట్టువుల వలన న్యాయస్థాన సమస్యలు, కోర్టు కేసులు,

మెదడు నరాలు లేదా రక్తానికి సంబందించిన ఆనారోగ్య ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

20 – నవంబర్ – 2021 నుండి గురువు శుభత్వం వలన మిధున రాశి వారికి పూర్తిగా అనుకూలించును.

వారసత్వానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగి .. స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును.

మిధునరాశికి చెందిన సంతానం వలన వారి తల్లిదండ్రులు కూడా 20 -నవంబర్ -2021 తదుపరి మంచి ఫలితాలను పొందుతారు.

అన్ని విధాలుగా గురువు నవంబర్ 20 నుండి అనుకూల ఫలితాలను ఇస్తాడు.

*మిధునరాశి వారికి అష్టమశని ప్రభావం వలన ప్రతికూలమైన ఫలితాలను ఇస్తాడు.

ఆరోగ్య పరంగా సమస్యలు కొనసాగును.

వృద్ధులైన తల్లిదండ్రులకు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం.

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండవలెను.

శని దేవునికి జప, శాంతులు జరిపించుకోనుట మంచిది.

* రాహువు – కేతువు వలన వ్యాపార సంబంధమైన, వివాహ సంబంధమైన విషయాల్లో మరియు కోర్టు తగాదాలలో విజయం సాధిస్తారు.

ఈ సంవత్సరం అంతా ఎక్కువగా వృధా ఖర్చులు ఉంటాయి, చేస్తారు .

సంపాధించిన ధనం చేతిలో నిలుపుకోలేరు.

అనుకున్న విధంగా ధనం పొదుపు చేసుకోలేరు.

స్నేహితుల వలన ఆర్ధిక సంబంధిత ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి,

నమ్మక ద్రోహలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త.

ఈతలకు (స్విమ్మింగ్)లకు దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.

పాట్నర్ షిప్ వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో ఎక్కువ జాగ్రత్తతో ఉండవలెను.

సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం, వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.

* (ఇతర అన్ని గ్రహ స్థానాల ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి.)

వృత్తికి సంబంధించిన వ్యవహాములలో విజయాలను సూచిస్తున్నాయి.

ఉన్నత విద్యకు ఎంపిక అవుతారు.

స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.

స్వగృహ నిర్మాణం కల ఈ సంవత్సరం నెరవేరుతుంది.

సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి. (దంపతులిరువురి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయి)

ఉద్యోగంలో భాద్యతతో కూడిన అధికారం పెరుగుతుంది.

రాజకీయ జీవితంలో ఇది పరీక్షా కాలం లాగా ఉంటుంది. మౌనం మంచిది. మాట జారకూడదు .

స్వయం కృతాపరాధం వలన కొన్ని బంధాలను నష్ట పోవలసి వస్తుంది.

తొందరపడి మాట్లాడం, నిర్ణయం తీసుకోవడం తీసుకోవద్దు. నోటి దురుసు మంచిదికాదని గ్రహించండి.

సంవత్సర ద్వితీయార్ధంలోజీవితం మరో కొత్త పంధాలో నడుస్తుంది.

మీ పేరు మీద ఉన్న స్థిరాస్తులకు విలువ పెరుగుతుంది.

విలువైన వస్తువులు, ముఖ్య పత్రాలు, సర్టిఫికెట్లు మొదలగు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం,

అశ్రద్ధ వలన ముఖ్యమైనవి పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త .

వ్యవసాయ దారులకు రెండు పంటలు అనుకూలం, లాభాలు ఉంటాయి.

ఉద్యోగస్తులకు అనుకూలమైన స్థాన చలనం ఉంది.

రాజకీయ నాయకులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది.

వ్యాపారస్తులకు ధర్మబద్దత కూడిన .. న్యాయమైన వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి.

మోసపూరితమైన .. తప్పుడు వ్యాపారాలు ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించండి.

విద్యార్ధులు ఎక్కువ శ్రద్ద పెట్టి చదువుకోవాలి.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో నిత్యం పూజ చేయండి.


కర్కాటకరాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

పునర్వసు నక్షత్ర 4 వ పాదాల వారు, పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములవారు, ఆశ్లేష నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుదు
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటకరాశి వారికి
ఆదాయం 14, వ్యయం – 02,

రాజ పూజ్యం – 06, అవమానం – 06

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు అష్టమ స్థానమైన (కుంభం)లో తామ్రమూర్తిగా .. తర్వాత నవంబర్ 20 వరకు సప్తమంలో రజితమూర్తి.. ఆ తర్వాత సంవత్సరం అంతా అష్టమంలో సువర్ణ మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా … సప్తమ స్థానమైన (మకరరాశి)లో తామ్ర మూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 11 , 5 (వృషభ, వృశ్చిక) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.

గురువు ఉగాది నుండి ఆశుభుడు కాబట్టి సంవత్సరమంతా అనుకూల ఫలితాలను ఇవ్వడు.

గత శార్వరి నామ సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వలన కొన్ని ఇబ్బందులతో కొనసాగును.

ముఖ్యంగా గురువు నవంబర్ 20 నుంచి తీవ్రమైన ఆర్ధిక సమస్యలు కలుగజేయును.

స్వార్జితం మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ ఖర్చు అవుతాయి.

వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్రలో కానీ లేదా శత్రు స్థానాలలో ఉంటే గురువుకు అభిషేకాలు, శాంతి జపములు చేయించాలి.

* శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును.

కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలలో విజయం పొందుతారు .

జాతకంలో శని వలన కళత్ర దోషం ఏర్పడిన వారు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందురు.

విశేషించి అనారోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

ఆరోగ్య పరమైన విషయాలలో ఎంత మాత్రం అశ్రద్ద పనికిరాదు.

* రాహువు – కేతువులు ఇద్దరూ అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తారు .

ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధన లాభం ఉన్నదంటే అది రాహు – కేతువుల వలననే ఏర్పడును.

ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి విజయం ఏర్పరచును.

సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును.

* (ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి.)

వృత్తి వ్యాపారాలలో కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

* అవివాహితులకు వివాహ యోగం.

సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును.

వ్యక్తిగత జాతకాల ఆధారంగా భార్యాభర్తలకు సంబంధించి కొందరి విషయాలలో దూరం అవడం కానీ లేదా విడిపోవడం కానీ శాశ్వతంగా దూరం అవ్వడం కాని జరిగే ఆస్కారం ఉంది. (ఇది అందరికీ వర్తించదు.)

రాజకీయ రంగాలలో రానిస్తారు. కానీ సెప్టెంబర్ వరకు స్వంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తాయి.

జీవితంలో కొంత మంది దూరం అవుతారు.

వ్యాపారం పరంగా వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటారు.

కుటుంబంలో అందరితో కలిసి ఉన్ననూ .. మీరు ఒంటరివారేనన్న భావన కల్గుతుంది .

విద్యాకు సంబందించి విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

ఈతలకు (స్విమ్మింగ్)లకు దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.

వ్యవసాయ దారులకు మొదటి పంట అనుకూలంగా వస్తుంది. రెండవ పంట ఆశించినంత రాకపోవచ్చును.

ఉద్యోగస్తులకు ఇష్టం లేని బదిలీలు ఉంటాయి.

తోటి ఉద్యోగులతో విరోధాలు ఏర్పడే సూచనలున్నాయి.

పై అధికారులతో సఖ్యత ఉండదు.

అవకాశం చేసుకుని చండీ హోమం జరిపించుకోవడం మంచిది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, స్వయంభూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని ఆరాధన, మరియు హోమ కార్యక్రమం జరిపించుకుంటే మంచి జరుగుతుంది.


సింహరాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

మఘ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4, పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు .
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి

ఆదాయం 02, వ్యయం – 14,

రాజ పూజ్యం – 02, అవమానం – 02.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు సప్తమ స్థానమైన (కుంభం)లో సువర్ణ మూర్తిగా.. ఆ తర్వాత సంవత్సరం అంతా సప్తమంలో తామ్ర మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరం అంతా … షష్టమ స్థానమైన (మకరరాశి)లో సువర్ణ మూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 10 , 4 (వృషభ, వృశ్చిక) రాశులలో లోహ మూర్తులుగా ఉంటారు.

ఉగాది నుండి గురువు అశుభత్వం వలన 19 నవంబర్ 2021 వరకు ఏ పని చేసిన కలిసి రాదు.

గత శార్వరి నామ సంవత్సరపు వలె కొన్ని సమస్యలతో కొనసాగును.

20 నవంబర్ 2021 నుండి గురువు శుభత్వం వలన అప్పటి నుండి యోగించును.

ఆర్ధికపరమైన నూతన అవకాశాలను కలుగజేయును.

అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి.

వైవాహిక జీవితంలో సుఖసౌఖ్యాలను పొందుతారు.

చాలా కాలం నుండి వైవాహిక జీవితంలో ఎదుర్కుంటున్న సమస్యలు తొలగిపోవును.

జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడుతాయి.

* శని సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తాడు .

కుటుంబ మరియు వృత్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు.

తగాదలలో ఉన్న స్థిరాస్తి సమస్యలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు అధికంగా ఉన్నవి.

* రాహువు – కేతువులు సంవత్సమంతా సంపూర్ణ భాగ్యాలను కలిగిస్తారు .

విశేషమైన ధనార్జనకు అవకాశాలు ఏర్పరచును.

మాత్రు వర్గం వారి వలన లాభపడుదురు.

భూమి స్థలం లేదా గృహ నిర్మాణ ప్రయత్నాలకు ఈ సంవత్సరం అనుకూల కాలం.

* రాహు – కేతువుల వలన విద్య పరంగా విద్యార్థులకు చక్కటి ఫలితాలను ఇస్తారు.

* (ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి.)

మీరు ఎంత సర్దుకు పోయినా.. మీరు వివాదాస్పద వ్యక్తిగానే ముద్రపడతారు.

అందరితో కలసి పనిచేయరు, ఒంటరిగానే సాధిస్తారు.

విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో వీసా, గ్రీన్ కార్డ్ లభిస్తుంది.

కేవలం మనోధైర్యం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది.

బంధువులతో, సన్నిహితులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి.

మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం.

ఆరోగ్య పరంగా మోకాళ్ళ నొప్పులు,

వైరస్ వలన కొంత ఆరోగ్యం చికాకు పరుస్తుంది.

రాజకీయ నాయకులకు, నటులకు, గాయకులకు సంవత్సర చివరి కాలం యోగాదాయకంగా ఉండును.

మీ మీద నరదృష్టి అధికంగా ఉంటుంది .

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతారు.

వ్యవసాయ దారులకు అన్ని పంటలు అనుకూలంగా లాభిస్తాయి.

రాజకీయ రంగం వారికి అధిస్టానం నుండి గుర్తింపు, పదవి ప్రాప్తి కలుగుతుంది.

విద్యార్ధులకు మంచి యోగం , కోరుకున్న కాలేజీలో సీటు వస్తుంది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, సూర్య దేవుని ఆరాధన చేయండి.


కన్యరాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి

ఆదాయం 05, వ్యయం – 05,
రాజ పూజ్యం – 05, అవమానం – 02.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి చక్కటి విజయాన్ని సూచించుచున్నది.

కన్యారాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. తరచుగా గురు గ్రహం అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అపవాదులు ఏర్పరచును. వారసత్వ సంబంధ స్థిరాస్తులు నష్టపోవు సూచనలు అధికంగా ఉన్నవి. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన కన్యారాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రతీ విషయంలో ఆలోచించుకొని వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలో ముఖ్య నిర్ణయాలలో చాలా జాగ్రత్త వహించాలి.

శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి సుందరమైన పుత్రికా సంతానం లభించును. పుత్ర సంతానమునకు మాత్రం ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. లోహ సంబంధ వ్యాపారాలు చేసే వారు విశేషమైన లాభములు పొందుతారు.

రాహువు- కేతువు ఇరువురూ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. భూ సంబంధ వ్యాపారాలు చేయు వారికి విశేష ధనార్జన కలుగ చేయును. అయితే పితృ వర్గం వారికి సంవత్సరం మధ్య మధ్య తీవ్ర ఆరోగ్య భంగములు కలుగ చేయును.

ఇంటియందు శుభాకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. గృహ యోగం, గృహనిర్మాణం చేసే అవకాశం ఉన్నది.ఉన్నతలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పేరుప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి విశేషమైన కృషి చేస్తారు. విదేశాలకు సంబధించిన విషయాలలో అనుకూలంగా ఉంది. వీసా, గ్రీన్ కార్డు మొదలైనవి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహయోగం, సంతానం కోసం ఎదిరి చూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది జాగ్రత్తలు వహించండి.


తులారాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

చిత్త 3, 4 పాదములవారు, స్వాతి 1,2,3,4 పాదములవారు, విశాఖ 1,2,3 పాదములులో జన్మించిన వారు తులారాశికి చెందుతారు.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులారాశి వారికి

ఆదాయం 02, వ్యయం – 08,

రాజ పూజ్యం – 01, అవమానం – 05

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు పంచమ స్థానమైన (కుంభం)లో లోహమూర్తిగా ఉంటాడు .. తర్వాత నవంబర్ 20 వరకు చతుర్ధములో రజిత మూర్తిగా ఉండి .. తదనంతరం సంవత్సరమంతా ఐదో ఇంట్లో లోహమూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా … చతుర్ధ స్థానమైన (మకరరాశి)లో లోహమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 8, 2 (వృషభ, వృశ్చిక) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.

ఈ ఉగాది నుండి గురువు వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.

నవంబర్ 19 వరకు శత్రులపై విజయాలను సాధిస్తారు.

స్వంత ఇంటి కల ఈ సంవత్సరం సాకారం అవుతుంది.

భూమికి సంబంధించిన, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది అనుకూలమైన కాలం.

మాత్రు వర్గీయుల నుండి ఆర్థిక పరమైన లాభములను పొందుదురు.

గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి ఊరట లభింస్తుంది.

నవంబర్ 20 నుండి గురువు (అశుభుడు) అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు.

తరచూ అనవసరమైన తగాదాలు,

ఆరోగ్య సమస్యలు, వృధా ధన వ్యయం, అనుకోని ఖర్చులు.

షేర్ మార్కెట్ లేదా వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించి నష్టాలను సూచిస్తున్నాయి.

* తులారాశి వారికి అర్దాష్టమ శని ప్రభావం నడుస్తున్నది.

అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి.

శని ప్రభావం ఉన్నప్పటికిని.. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభింస్తుంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారుకి శని లాభాలను కలిగిస్తాడు.

మొత్తం మీద ఈ సంవత్సరం .. శని తులారాశి వారికి చక్కటి అభివృద్ధి కరమైన ఫలితాలు ఇస్తాడు.

రాహువు – కేతువుల వలన ఆర్థిక పరమైన లాభాలను ఇచ్చినా .. మిగిలిన విషయాలలో శుభ ఫలితాలను ఇవ్వలేడు.

ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తి గత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది,

సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం, వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.

జీవిత భాగస్వామికి సంబంధించిన అసంతృప్తి కలుగుతుంది,

సంతానం లేని వారికి వారు చేయు .. సంతాన ప్రయత్నాలు విఫలం మగును.

ఎదిగిన సంతానం విషయంలో వారి వ్యవహార శైలి వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

* ఈ ప్లవ నామ సంవత్సరంలో రాహు – కేతువులు (అశుభులు) కాబట్టి శుభ ఫలితాలను ఇవ్వరు.

* (ఇతర అన్ని గ్రహ స్థానాల ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి.)

గ్రహ గోచార తరుణోపాయాల వలన సంతానం లేనివారికి సంతాన యోగం కలుగుతుంది.

అన్ని ఉన్ననూ.. ఎదో లోటుగా మిమ్మల్ని భాదిస్తుంది.

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.

ఒకప్పుడు మిమ్మల్ని అత్యంత గౌరవించిన వారే బద్దశత్రువులు అవుతారు.

సమాజంలో గౌరవం, మర్యాదలు తగ్గుతాయి,

అన్నదమ్ములతో మరియు ఆత్మీయులతో విరోదాలు ఏర్పడుతాయి,

మితిమీరిన విశ్వాసం వలన అపకీర్తి, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కుంటారు.

ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోంటున్న కాలంలోనే ..మీకు అనుకున్న ఉద్యోగం లభించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

గతాన్ని పక్కనబెట్టి నూతన జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభిస్తారు.

కొన్ని విషయాలలో ఎవరో చేసిన పనికి మీరు భాదపడవలసి వస్తుంది.
ఈతలకు (స్విమ్మింగ్) దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.
ఇక మీదట ఇతరులపై పెత్తనం, అజమాయిషీ చేయకూడదని నిర్ణయించుకుంటారు.
వ్యవసాయ దారులకు పంటలు అనుకూలంగా లాభాన్ని ఇస్తాయి.
ఉద్యోగస్తులకు సెప్టెంబర్ నవంబర్ మధ్య కాలంలోఅనుకోని తగాదాలు, కొత్త చిక్కులు ఏర్పడుతాయి.
అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.
రాజకీయ నాయకులకు ఈ కాలం కొంత ఇబ్బంది కరమైనదే.. గౌరవ ప్రతిష్టతకు ఇబ్బందులు ఏర్పడతాయి.
విద్యార్ధులు ఎక్కువ కష్టపడాలి.
వ్యాపారస్తులకు అంతగా కలిసిరాదు. జాగ్రత్తలు తీసుకోవాలి.
అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కుక్కలకు, పిల్లులకు వాటికి నచ్చిన ఆహార పదార్ధాలను ఇస్తూ ఉండండి.


వృశ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృశ్చికరాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి

ఆదాయం 08, వ్యయం – 14,

రాజ పూజ్యం – 04, అవమానం – 05

*శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి సమాజంలో అపవాదులు, అపఖ్యాతి పొందుట సూచించుచున్నది.

వృశ్చికరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం వలన ప్రధమ అర్ధ భాగం అనగా 19 నవంబర్ 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. చేపట్టిన కార్యములలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో నిలకడ లోపించును. ఆర్ధిక అంశాలలో ఇతరులకు రుణాలు ఇచ్చుట, ఇతరుల రుణాలకు హామీలు ఉండుట చేయకూడదు. 20 నవంబర్ 2021 నుండి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించును. విద్యార్ధులకు విదేశీ విద్యలో ఆశించిన ఫలితాలు లభించును. కుటుంబానికి భూ లేదా గృహ వసతిని ఏర్పరచుకోగలుగుతారు.
శని గ్రహం వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే సామాన్య యోగ వంతమైన ఫలితాలు ఏర్పడును. వృశ్చికరాశి వారికి శనైశ్చరుడు లాభ వ్యయాలను సమానంగా ఏర్పరచును. శ్రీ ప్లవ నామ సంవ

విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృశ్చికరాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 08, వ్యయం – 14, రాజ పూజ్యం – 04, అవమానం – 05
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి సమాజంలో అపవాదులు, అపఖ్యాతి పొందుట సూచించుచున్నది.

వృశ్చికరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం వలన ప్రధమ అర్ధ భాగం అనగా 19 నవంబర్ 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. చేపట్టిన కార్యములలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో నిలకడ లోపించును. ఆర్ధిక అంశాలలో ఇతరులకు రుణాలు ఇచ్చుట, ఇతరుల రుణాలకు హామీలు ఉండుట చేయకూడదు. 20 నవంబర్ 2021 నుండి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించును. విద్యార్ధులకు విదేశీ విద్యలో ఆశించిన ఫలితాలు లభించును. కుటుంబానికి భూ లేదా గృహ వసతిని ఏర్పరచుకోగలుగుతారు.

శని గ్రహం వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే సామాన్య యోగ వంతమైన ఫలితాలు ఏర్పడును. వృశ్చికరాశి వారికి శనైశ్చరుడు లాభ వ్యయాలను సమానంగా ఏర్పరచును. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా తీవ్ర వ్యతిరేక ఫలితాలు కాని, తీవ్ర అనుకూల ఫలితాలు కాని ఏర్పడవు.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన చక్కటి ఆర్ధిక లాభములు, వ్యాపార సంబంధ విజయాలు, ఆర్ధిక లావాదేవీలలో కోర్టు కేసులు అనుకూలంగా తీర్పులు లభించుట వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కష్టములు ఎదురగును. ముఖ్యంగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు, నిత్య తగాదాలు ఎదురగును. అవివాహితుల వివాహ సంబంధ ప్రయత్నాలు కూడా కష్టం మీద ఫలించును. వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృశ్చికరాశి వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.

* భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలున్నా ఆర్ధిక పరమైన విషయాలలో ఒకటిగా ఉంటారు. చాలా మదికి మీ సంపాదన మీదతప్ప మీ మీద మమకారం లేదని గ్రహించండి. వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపార విస్తరణకు విశేషంగా కృషిచేసి అనుకూల ఫలితాలు పొందుతారు.ఇంటియందు శుభకార్యాలు చేయుట, నూతన గృహారంభాలకు చొరవ చూపిస్తారు. రైతులకు పంటలు లాభాదాయంకంగా పడును. చెడ్డవారితో స్నేహం చేయట తెలియక చేసిన పొరపాటుకు అపనిందలు వస్తాయి. ప్రతి విషయంలో పట్టు విడుపు దొరని ఉండాలి.కొత్త వ్యాపారంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. చెప్పుడుమాటలు విని ఏ నిర్ణయం తీసుకోరాదు. చిన్న చిన్న చిల్లర తగాదాలు ఎక్కువైతాయి జాగ్రత్తలు వహించాలి.


ధనస్సు రాశివారి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

మూల 1,2,3,4 పాదములు లేదా పుర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనస్సురాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనస్సురాశి వారికి

ఆదాయం 11, వ్యయం – 05,

రాజ పూజ్యం – 07, అవమానం – 05

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనస్సురాశి వారికి యంత్ర సంబంధ వ్యాపార వ్యవహారములో విజయం పొందుట సూచించుచున్నది.

ధనస్సురాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు ఈ సంవత్సరంలో కూడా ఏలినాటి శని చివరి అంకం 17 జనవరి 2023 వరకు ఉన్నది.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనస్సురాశి వారికి గురు గ్రహం వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ జీవనంలో సుఖ లేమి ఎదుర్కొందురు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చును లేదా చోరుల వలన ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టు కొనుట లేదా ఆరోగ్య సమస్యలు పొందుట జరుగును. సొదరీ వర్గం వలన ప్రయోజనం పొందుతారు. వారి వలన కొన్ని కష్టాల నుండి బయట పడతారు.

ధనస్సురాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే శనైశ్చరుని వలన ఇబ్బందులు కొనసాగుతాయి. కష్టం మీద తలచిన విధంగా ధనాన్ని కూడబెట్టగలుగుతారు. మొదటి వివాహం నష్టపోయి , పునర్ వివాహ ప్రయత్నాలు చేయు వారికి ఈ ప్లవ నామ సంవత్సరం పునర్ వివాహ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పరచును ధనస్సురాశి వారు ఈ ప్లవ నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. తరచుగా ఏలినాటి శని ప్రతికూల ప్రభావ నిర్మూలన కోసం శనికి శాంతి జపములు చేయించుకొనుట మంచిది.

రాహు – కేతువులు ఇరువురూ సంవత్సరమంతా అనుకూల ఫలితాలనే ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో రాహు – కేతువులు ఉచ్చ లేదా స్వక్షేత్ర ములలో ఉన్న వారు సమాజంలో విశేష ఖ్యాతిని ఆర్జించెదరు. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా లభించును. దేవాలయములు లేదా ధార్మిక కేంద్రాలను నిర్మించుటలో పాత్ర వహిస్తారు.

* జీవితభాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించాలి. ఇతరులకు ఇచ్చిన డబ్బులు అంత సులువుగా తిరిగిరావు. మీ మనస్సులోని భావాలను ఇతరులకు తెలియజేయడం వలన చాలా మంది విరోధులు అవుతారు. కొంత అపఖ్యాతి,అపనిందలు వస్తాయి. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగలో అభివృద్ధి కనబడుతుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది. చండి హోమక్రతువు జరిపించుకోవడం వలన ఆరోగ్య,ఆర్ధికంగా కొంత అనుకులతలు కనబడతాయి.


మకర రాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

ఉత్తరాషాడ 2,3,4 పాదములు లేదా శ్రవణం 1,2,3,4 పాదములు లేదా ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకరరాశి వారికి

ఆదాయం – 14, వ్యయం – 14,
రాజ పూజ్యం – 03, అవమానం – 01

ప్లవ నామ సంవత్సరంలో మకరరాశి వారికి ఆరోగ్య చికాకులను, కుటుంబ సమస్యలను సూచించుచున్నది.

మకరరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి సంవత్సరం మొత్తం ఏలినాటి శని ప్రభావంతో ఉంటారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. గురువు వలన ఈ సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతికూల ఫలితాలు, 20 నవంబర్ 2021 నుండి అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. ఆశించిన విధంగా ధనం వృద్ది చెందుతుంది. సంతాన ప్రయత్నాలలో కూడా సఫలత లభిస్తుంది.

మకరరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని ద్వితీయ పర్యాయం నడుస్తుంది, ఇది 29 మార్చి 2025 వరకు ఉంటుంది. శని తనుస్థానంలో స్వక్షేత్రంలో ఉండుట వలన వ్యక్తిగత జాతకంలో శని దోషం ఉన్న మకరరాశి వారికి ఈ ప్లవ నామ సంవత్సరం అంతా కలసి రాదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశాపరచును. మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందురు. వృధాగా ధనం వ్యయం అగును. మీ కుటిల స్వభావం వలన మంచి మిత్రులను దూరం చేసుకొనుటకు సూచనలు అధికంగా ఉన్నవి. చర్మ సంబంధ సుఖ వ్యాధులు వలన బాధలు ఎదుర్కొందురు.
రాహు – కేతువులు ఇరువురి వలన వ్యక్తిగతంగా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడవు. అయితే జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో బాగా ఎదిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పరచును.

* కొంత కష్టమో, నష్టమో జీవితాశాయాన్ని సాధిస్తారు. కుటుంబ కలహాలు, కొన్ని విషయాలలో జీవితభాగస్వామి అభిప్రాయాలు కల్వకపోవచ్చును. ఇష్టమైన ఉద్యోగం పొందుతారు. రాజకీయ రంగానికి చెందినవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సన్మానాలు, సత్కారాలు కలుగుతాయి. అనుకోని అవకశం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నం చేసుకునేవారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. అంతరంగిక రాజకీయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. కుటుంబంలోని పెద్దలు లేదా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాల అవసరం అని గ్రహించిండి.


కుంభ రాశి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి

ఆదాయం 14, వ్యయం – 14,

రాజ పూజ్యం – 06, అవమానం – 01

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎదురగు శారీరక మరియు మానసిక సమస్యలను సూచించుచున్నది.

కుంభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి ఏలినాటి శని ప్రధమ పర్యాయ ప్రభావంతోనే ఉన్నారు. ఈ ఏలినాటి శని 23 ఫిబ్రవరి 2028 వరకు ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గురు గ్రహం వలన ఈ సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు సంతానం వలన లేదా సంతాన విషయ మూలక సమస్యలు, సోదర, సోదరి వర్గం వలన ఇబ్బందులు, మానసిక చికాకులు, వృధాగా ధన వ్యయం వంటి వ్యతిరేక ఫలితాలు ఏర్పడును. 20 నవంబర్ 2021 నుండి గురువు లగ్న స్థానములో ఉండుట వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. జీవన విధానంలో ఆశించిన ఉన్నతి పొందుతారు. ఉద్యోగ జీవనం లోని వారికి కోరుకున్న విధంగా అనుకూల మార్పులు లభిస్తాయి. శరీర బరువు అదుపులో పెట్టుకోవలెను. నరముల లేదా మెదడు సంబంధిత అనారోగ్యలతో బాధ పడుతున్నవారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

కుంభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శనైశ్చరుడు వ్యయ స్థానంలో ఉండుట వలన సంవత్సరం అంతా యోగించడు. కుంభరాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా వాహనాలు, ప్రయాణాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. వ్యాపార రంగం లోని వారు నూతన భారీ పెట్టుబడులు పెట్టుడం మంచిది కాదు. బంగారు ఆభరణాలపై ఋణాలు తీసుకొనుట కూడా మంచిది కాదు. వ్యయ స్థాన గతుడైన శని వలన వడ్డీల వలన భాదపడు సూచనలు అధికంగా ఉన్నవి. తరచుగా శనికి తైలభిషేకలు జరుపుట మంచిది.

రాహు – కేతువులు ఇరువురి వలన కుంభరాశి వారందరూ చక్కటి అనుకూల ఫలితాలు లభించును. ముఖ్యంగా రాజకీయ రంగంలోని వారికి మిక్కిలి ప్రతిష్టాత్మక పదవులు లభింప చేయును. విద్యార్ధులకు కూడా ఆశించిన విధంగా ఉన్నత విద్యావకాశాలు లభింప చేయును. పర దేశ విద్యాలయలందు ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు లాభించును.

* అవివాహితులకు వివాహకాలం. మీకు ఇష్టమైన ఉద్యోగం వస్తుంది. కోరుకున్న చోట చదువుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. స్వగృహ యోగ్యత కలుగుతుంది. మీపై కొంతమంది అసూయా ద్వేషాలు చిలికి చిలికి గాలివాన అవుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలం కావు. వ్రుత్తి ఉద్యోగాల పరంగా కలిసి వస్తుంది. లాభం వచ్చినధనాన్ని పొదుపు లేక పెట్టుబడి రూపంలో పెడతారు. మీరు విరోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మీపై ఆరోపణలు వస్తాయి. కొన్ని పుకార్లు తాత్కాలికంగా ఇబ్బందిని కలిగిస్తాయి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు మీరు విలువ ఇవ్వలేదని విమర్శలు వస్తాయి. ఈ సంవత్సరం జీవితం మంచి గొప్ప మలుపు తిరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు, గొప్ప

ఉద్యోగం లభిస్తుంది. అనారోగ్యం ఉన్న పెద్దగా బాధించదు.


మీన రాశివారి వారికి శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి

ఆదాయం 11, వ్యయం – 05,

రాజ పూజ్యం – 02, అవమానం – 04

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి వ్రుత్తి పరమైన జీవనంలో చక్కటి విజయం సూచించుచున్నది.

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం లాభస్థానం వలన ఈ సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతీ వ్యవహారం అవలీలగా నెరవేరును. చక్కటి మిత్ర వర్గం మాత్రం లభించును. నూతన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 20 నవంబర్ 2021 నుండి మీ చేతిపై ధర్మ కార్య సంబంధ వ్యయం తరచుగా ఏర్పడును. దీర్ఘ కాలికంగా ఎదురుచూస్తున్న విహార యాత్రలను అనుభవించ కలుగుతారు.

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభించును. ఆర్ధికంగా విశేష యోగం అనుభవిస్తారు. శని వలన ఈ సంవత్సరం తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఏమి లేవు. మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

రాహు కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్భాగ్యములు, సంతోషములు ఏర్పడును. రాహు కేతువుల వలన అన్ని వర్గముల వారికి సుఖమయ జీవనం ఏర్పరచును. (వ్యక్తిగత జాతకంలో రాహు – కేతువులు నీచ క్షేత్రంలో ఉన్నవారు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు.)
రాజకీయ సంబంధమైన జీవితం బాగుంటుంది. ప్రేమ వివాహాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొద్దిపాటి ఒడి దుడుకులు ఉంటాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. సంవత్సర ద్వితీయార్ధం అక్టోబర్ లో వివాహాది శుభకార్యాలు ముడిపడుతాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభించును. అవసారాలకు ధనం ఎదో రూపంలో మీ దగ్గరకు వస్తుంది.. గృహ నిర్మాణం చేయుట, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుట జరుగును. నవంబర్ నుండి గృహంలో కలవరములు సోదరులతో భేదాభిప్రాయాలు వస్తాయి. ఉద్యోగ మార్పు. పొత్తుతో చేసే వ్యాపారాలలో అవక తవకలు ఏర్పడతాయి.

-ఎన్‌.రాజ్య‌ల‌క్షి
 జ్యోతిష్య‌పండితులు

Leave A Reply

Your email address will not be published.