15 రోజుల వయసున్న పాపతో విధులకు హాజరైన ఐఎఎస్‌!

లక్నో : ఆమె ఒక ఐఏఎస్‌ అధికారి తన కుమార్తె పుట్టిన 15రోజులకే తిరిగి విధులకు హాజరైంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మోదీనగర్‌ సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా తన 24 రోజుల కుమార్తెతో కలిసి ఫైల్స్‌ చూస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సెప్టెంబర్‌ 17న పాపకు ఆ అధికారి జన్మనిచ్చింది. ఆ ఐఎఎస్‌ అధికారి పేరు సౌమ్య పాండే.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో మోదీనగర్‌లో సంవత్సరం క్రితం ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటో విషయంపై మాట్లాడుతూ… కుటుంబంతో పాటు దేశ సేవ కూడా ముఖ్యమైందని అన్నారు.  మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి బిటెక్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బంగారు పతకం సాధించింది. ఆ తరువాత మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ పరీక్షల్లో మొదటి పది స్థానాల్లో నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.