యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 158 తులాల బంగారం: ఎమ్మెల్యే గాదరి కిశోర్
యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఎమ్మెల్యే గాదరి కిశోర్ 158 తులాల బంగారం సమర్పించారు. తుంగతుర్తి నియోజకవర్గం తరపున, కుటుంబం తరపున కలిపి మొత్ం 158 తులాల బంగారం దేవస్థానం ఈఓ గీతకు అందజేశారు. గాదరి కిశోర్ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించనున్నారని, లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు యావత్ ప్రజానీకంపై ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.