16న అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంటర్వ్యూలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 16వ తేదీన ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఈ ఉద్యోగాల కోసం 2020 సంవత్సరం నవంబర్‌లో నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా 10 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16న నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది.