Palnadu: జిల్లాలో ప‌దిరోజుల్లో 160 కేసులు.. 1200 మంది అరెస్టు

 

వినుకొండ చెడు ఘ‌ట‌న‌ల‌తో ప‌ల్నాడు జిల్లా పేరు దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారంలోకి రావ‌డం బాధిస్తోంద‌ని ఎస్‌పి మ‌లికా గార్గ్ అన్నారు. వినుకొండ‌లో పోలీసులు ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప‌ది రోజుల్లో 160 కేసులు న‌మోద‌య్యాయిన‌, సుమారు 1200 మందిని అరెస్టు చేశామ‌న్నారు. న‌ర‌స‌రావుపేట జైలులో ఖాళీలేక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలుకు పంపుతున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా మాచ‌ర్ల‌, న‌ర‌స‌రావుపేట పేర్లు చెడుగా మార్మోగుతోంద‌ని , క‌ర్ర‌లు, రాడ్లు ప‌ట్టుకొని తిర‌గ‌డం, దాడులు అవ‌స‌ర‌మా అని ఎస్‌పి ప్ర‌శ్నించారు. జిల్లాలో ఇంత ఫ్యాక్ష‌నిజం ఉందా? అని స్నేహితులు అడుగుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

ప‌ల్నాడు జిల్లాలో 144 సెక్ష‌న్ ఉంది. ఎవ‌రైనా ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌పై రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ఎగ్జిట్ పోల్స్ వివ‌రాలు వ‌స్తే ఇళ్ల‌లోనే కూర్చుని వినండి. కౌంటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు రోడ్ల‌పై ఎవ‌రూ తిరొగొద్ద‌ని హెచ్చ‌రించారు. ఇపుడు నేను కూడా ప‌ల్నాడు జిల్లా వాసినే. ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాల‌న్న‌దే నాల‌క్ష్యమ‌ని ఎస్‌పి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.