దేశంలో కొత్తగా 18,795 కేసులు
18,795 new cases in the country

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 18,795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేశారు.
- గత 24 గంటల్లో దేశంలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది.
- ఇప్పటి వరకు వైరస్ బారిన పడి దేశంలో 4,47,373 మంది మరణించారు.
- కొత్తగా 26,030 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది.
- గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా వ్యాక్సిన్ ఇచ్చారు.
- ఇప్పటి వరకు మొత్తం టీకాలు తీసుకున్నవారి సంఖ్య 87 కోట్లు దాటింది.