హిమాయత్, ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద
4200 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు.
హైదరాబాద్ (CLiC2NEWS): హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతున్న నేపధ్యంలో ఈ ఉదయం 8 గంటలకు రిజర్వాయర్ మరో రెండు గేట్లను రెండు అడుగుల పైకి ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. మొత్తం 6 గేట్ల ద్వారా 4200 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీకి వదులుతున్నారు.
ఉస్మాన్ సాగర్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్(గండిపేట) జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది.
నాలుగు గేట్ల ఒక అడుగు మేర ఎత్తి 480 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదిలినారు. ఈ ఉదయం (28.09.21) 8 గంటలకు నాలుగు వరద గేట్లను రెండు నుండి మూడు అడుగుల ఎత్తుకు పెంచి 1360 క్యూసెక్లను ముసిలోకి విడుదల చేస్తున్నారు.
.