2 నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలుస్తాం: ఎంఐఎం ఎమ్మెల్యే

హైద‌రాబాద్‌:మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం తల్చుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ముంతాజ్ అహ్మద్‌‌ఖాన్‌ హెచ్చరించారు. కేటీఆర్ ‘చిలక’ అని పేర్కొన్న ఆయన కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లో కళ్ళు తెరిచాడని అన్నారు. మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తా తో సమానం అంటూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలకు ఎంఐఎం మద్దతు ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని టీఆర్ఎస్, ఎంఐఎం గతంలో ప్లాన్ చేశాయి. ఈ క్రమంలోనే కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని రాష్ట్రంలో విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిని తిప్పి కొట్టేందుకు ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చని అంటున్నారు. అయితే తమకు వారికి పొత్తి లేదని రెండు పార్టీలు ప్రకటించాయి కూడా.

Leave A Reply

Your email address will not be published.